సీఎం జగన్‌ పై 10 ప్రశ్నలు సంధించిన చంద్రబాబు

-

 

 

సీఎం జగన్‌ పై 10 ప్రశ్నలు సంధించారు చంద్రబాబు. హామీలన్నీ నెరవేర్చాను అని చెపుతున్న సీఎం జగనుకు చంద్రబాబు పది ప్రశ్నలు వదిలారు. పది ప్రధాన హామీలకు సమాధానం చెప్పాలంటూ ప్రశ్నలు సంధించారు చంద్రబాబు. కేంద్రం మెడలు వంచి సాధిస్తామన్న ప్రత్యేక హోదాపై ఏమంది? 2020 నాటికి పూర్తి అవ్వాల్సిన పోలవరం నాశనం చేశావని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడా.. లేదా? ఒక్కటైనా ఇచ్చాడా?అన్నారు.

టీడీపీ 14 ఏళ్లలో 11 డిఎస్సీల ద్వారా 1.50 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేశాను…ఏటా డీఎస్సీ అని హామీనిచ్చి ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ పెట్టారా? అని నిలదీశారు. మద్య నిషేధం చేయకపోతే.. ఓట్లు అడగను అన్నావు.. మరి ఏ మొహం పెట్టుకుని వై ఏపీ నీడ్స్ జగన్ అని బయలు దేరావ్? అని ప్రశ్నించారు. వారంలో సీపీఎస్ రద్దు అన్నావా లేదా.. ఇంకా వారం కాలేదా? మాట మీద నిలబడడం అంటే ఇదేనా? ఉచిత ఇసుక ఇస్తాను అన్నావా లేదా? ఇచ్చావా? రాజధానిగా అమరావతికి మద్దతు ఇచ్చి ఇప్పుడు మాట తప్పావా లేదా? అని నిలదీశారు. బాదుడే బాదుడు అని నాడు రాగాలు తీసిన ముఖ్యమంత్రి.. ఛార్జీలు తగ్గిస్తానని చెప్పావా లేదా? నేడు అధికారంలోకి వచ్చిన తరవాత కరెంట్ చార్జీలు పెంచాడా లేదా? అంటూ ప్రశ్నించారు బాబు.

Read more RELATED
Recommended to you

Latest news