ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. బీసీలకు ఏం చేశారో సీఎం జగన్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. “ఇదేం కర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమంలో భాగంగా నేడు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు మాట్లాడుతూ.. బీసీలకు టిడిపి ఉన్నతమైన పదవులు ఇచ్చిందని, రాజ్యాధికారంలో భాగస్వామ్యం అయితే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.
తాను సీఎం అయిన వెంటనే బీసీల అభివృద్ధికి మొదటి సంతకం చేస్తానని స్పష్టం చేశారు. సీఎం జగన్ బీసీల రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారని ఆరోపించారు. బీసీలు గట్టిగా మాట్లాడితే అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. బీసీలు, బీసీ వృత్తులను జగన్ అగౌరవపరుస్తున్నారని విమర్శించారు. సబ్ ప్లాన్ తెచ్చి 36 వేల కోట్లు ఇచ్చిన ఘనత టిడిపిదేనన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గీత కార్మికులకు మద్యం దుకాణాలలో 20% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.