నేషనల్ హార్టికల్చర్‌ బోర్డ్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరో ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. హరియాణా రాష్ట్రం గురుగ్రామ్‌ లోని నేషనల్‌ హార్టికల్చర్‌ బోర్డ్‌ లో కొన్ని ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే..

హార్టీ కల్చర్‌ లేదా అగ్రికల్చర్‌ లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక పోస్టుల వివరాలని చూస్తే.. హరియాణా రాష్ట్రం గురుగ్రామ్‌ లోని నేషనల్‌ హార్టికల్చర్‌ బోర్డ్‌ లో మొత్తం పది పోస్టులు వున్నాయి. అకడమిక్‌ అర్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సాలరీ విషయానికి వస్తే ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50,000 జీతంగా ఇస్తారు.

ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి 09-01-2023ని చివరి తేదీ. కనుక ఈలోగా అప్లై చేయడం మంచిది. ఇంటర్వ్యూలు 24-01-2023 తేదీన ఉంటాయి. పోస్టులకి అప్లై చేసుకోవాలంటే హార్టికల్చర్/ పోస్ట్-హార్వెస్ట్ టెక్నాలజీ/ అగ్రికల్చర్ ఎకనామిక్స్/ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుండాలి. లేదంటే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్/ ఫుడ్ టెక్నాలజీ/ ఫుడ్ సైన్సెస్ లో అయినా సరే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుండాలి. లేదంటే హార్టికల్చర్‌/ అగ్రికల్చర్ లో బీఎస్సీ చేసుండాలి, అగ్రి బిజినెస్‌ లో ఎంబీఏ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలని https://nhb.gov.in/ లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news