వివేకా కేసుతో సంబంధమున్న ఒక్కొక్కరు చనిపోతున్నారు – చంద్రబాబు

-

వైఎస్ వివేకా.. జగన్ ఆస్తుల కేసుల్లో సీబీఐ తీరుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసుతో ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో సంబంధం ఉన్న వారు ఒక్కొక్కరు చనిపోతున్నారని.. శ్రీనివాస రెడ్డి, గంగిరెడ్డి, గంగాధర రెడ్డిల వరుస మరణాల సంగతేంటీ..? అని నిలదీశారు. వైఎస్ వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్న వాళ్లని చంపేస్తారని మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని.. వైఎస్ వివేకా విషయంలో మేం చెప్పినట్టే జరుగుతోందన్నారు.

కరుడుగట్టిన నేరగాళ్లు వీళ్లు.. పరిటాల రవి విషయంలో ఇలాగే చేశారు… సీబీఐకి ఇది సవాల్.. సీబీఐ విశ్వసనీయతకే పెను సవాల్ అని పేర్కొన్నారు. జగన్ అవినీతిపై సీబీఐ ఛార్జ్ షీట్ వేసినా ఏం చేయలేకపోయిందని.. సీబీఐ ఏం చేయలేకపోతోంటే ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారు..? అని నిలదీశారు. నేరగాళ్లు రాజ్యం చేస్తోంటే సీబీఐ వంటి సంస్థలు కాపాడకుంటే ఎలా..? పల్నాడులో హత్యలు జరుగుతూనే ఉన్నాయని వెల్లడించారు.

గతంలో చంద్రయ్య హత్య చేశారు.. ఇప్పుడు జల్లయ్య చంపేశారు… కనీసం టీడీపీ నేతలను పరామర్శించడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు… టీడీపీ నేతలను ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తారా..? ఇది రాజ్యాంగ విరుద్దమని ఆగ్రహించారు చంద్రబాబు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపేస్తే.. ఇంటికి డెడ్ బాడీ పంపి.. అంత్యక్రియలకు చేసుకోండని అంటారా..? ఇంత జరుగుతోంటే పోలీసులు ఏం చేస్తున్నారు..? అసలు ఆల్ ఇండియా సర్వీసెస్ రాసే ఐపీఎస్సులయ్యారా..? అనంతబాబు ఎపిసోడ్ నుంచి దృష్టి మళ్లించడానికి కోనసీమ అల్లర్లా..?అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news