మహిళా దర్బార్ నిర్వాహాణపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై స్పందించారు. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అని… గవర్నర్ ప్రజలను కలవగలరా అని ప్రశ్నిస్తున్నారన్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయం అయిన ప్రజల కోసమేనని… ప్రజల పక్షాన ఒక బలమైన శక్తిగా ఎప్పుడు ఉంటానని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. నన్ను ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు గవర్నర్ తమిళి సై. తెలంగాణ ప్రజల కోసం నా పని కొనసాగుతూనే ఉంటుందని.. ప్రజల పక్షాన ఒక బలమైన శక్తిగా ఎప్పుడు ఉంటానన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఆనందంగా ఉండాలని.. నన్ను ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. విధానం ఏదైనా ప్రజల కోసమేనని… వినిపించని మహిళల గొంతుకలు వినిపించాలని తెలిపారు. నేను ఉత్ప్రేరకం మాత్రమేనని..మనమే గెలుస్తాం… ఎవరు అపపలేరన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై.