ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో రాజకీయాలు విపరీతంగా వేడెక్కాయి. ఈ క్రమంలో బాబుపై పెరుగుతున్న ఒత్తిడిల నేపథ్యంలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని అంటున్నారు!
ఇందులో భాగంగా రైతుల సానుభూతి పొందాలనో లేక నిజంగానే సీరియస్ గా పోరాడాలనో తెలియదు కానీ… తనతో కలిపి ప్రస్తుతానికున్న 20మంది ఎమ్మెల్యేలతో రాజినామాలు చేయించాలని బాబు ఫిక్స్ అయ్యారంట!
అవును… ఒకవైపు తనను నమ్మి భూములు ఇచ్చిన రైతుల ఆవేదన.. మరోవైపు బాబు మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టినవారి ఆవేశం.. పైగా నేడు రాజధాని ప్రాంత రైతులు పడుతున్న ఇబ్బందులకు బాబే కారణం అని అంతా భావిస్తోండటంతో… కనీసం రాజినామాలు చేసి అయినా ఆ విమర్శల ఒత్తిడి నుంచి తాత్కాలిక ఉపశమనం పొందాలని బాబు బావిస్తున్నారంట. అందులో భాగంగా… ఆదివారం లేక సోమవారం నాడు గవర్నర్ ను కలిసి మూకుమ్మడిగా రాజినామాలు సమర్పించాలని భావిస్తున్నారంట!!
వీరి ఆలోచనలు అలా ఉంటే… ఇంతకు మించిన అదృష్టం మరొకటి లేదు అని భావిస్తోందంట అధికార పార్టీ! అందులో భాగంగా యుద్ధ ప్రాతిపదికన టీడీపీ నేతల రాజినామాలను స్పీకర్ ద్వారా ఆమోదింపచేసుకుని ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి సిద్ధమవుతోందని అంటున్నారు!
ఆ 20లో కనీసం 10 అయినా కైవసం చేసుకోగలిగితే అమరావతితో పాటు బాబు అధ్యాయం కూడా ముగుస్తుందనేది అధికార పార్టీ ఆలోచనగా ఉందంట! ఏది ఏమైనా… మూడు రాజధానుల బిల్లు మరెన్ని సంచలనాలకు దారితీస్తుందో వేచి చూడాలి!! నిజంగా బాబు ఆ సాహసం చేసి ప్రజా క్షేత్రంలోకి వెళ్తే మాత్రం… ఏపీ రాజకీయాల్లో సంచలన పరిస్థితులు నెలకొన్నట్లే!!