Alert for Telugu people heavy rains again: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్షాలు ఉండనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో పశ్చిమబెంగాల్, చత్తీస్గడ్, ఒడిస్సా, బీహార్ రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ పై వర్ష ప్రభావం స్వల్పంగానే ఉన్నప్పటికీ రాబోయే మూడు రోజులలో మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. ఇక ఈనెల 30వ తేదీ నుంచి అక్టోబర్ నెల మొదటి వారం వరకు కోస్తా జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా ఏపీ ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ సూచనలు చేస్తున్నారు. అటు తెలంగాణ లోనూ వర్షాలు పడే ఛాన్స్ ఉందట.