చాలాకాలం తర్వాత బాబు హ్యాపీ… ఫిక్సయిపోవచ్చా?

ఏపీలో ఎన్నికల ఫలితాము వెలువడినప్పటినుంచి చంద్రబాబు హ్యాపీగా ఉన్న సందర్భాలు అతి తక్కువ కాదు కాదు.. అసలు లేవనే చెప్పాలి. బాబుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జగన్ తన పాలనసాగిస్తున్నారు. పోనీ ఏదో ఒక సమస్య సృష్టించి అయినా మనుగడ కాపాడుకోవాలని బాబు ఆలోచించినా.. కరోనా రూపంలో ప్రకృతి అడ్డుపడుతుంది! ఈ క్రమంలో ఇంతకాలానికి బాబుకు కాస్త ఉపసమనం.. కొద్దిపాటి ఆనందం కలిగిందంటే అది కచ్చితంగా గవర్నర్ పునఃనియామకం విషయంలో గవర్నర్ స్పందించడమే!


కరోనా సమయంలో ఎన్నికలు ప్రజారోగ్యానికే పెనుముప్పు అనే సదుద్దేశంతో ఎన్నికలు వాయిదా వేసిన ఎస్‌ఈసీని తొలగించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని మొదలుపెట్టిన చంద్రబాబు… ఆ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని సంప్రదించాకుండానే ఆ నీర్ణయం తీసుకున్నారన్న విషయాన్ని పక్కనపెట్టారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అంశంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు.

దీని ద్వారా భారత రాజ్యాంగం గౌరవాన్ని, కోర్టుల ఔన్నత్యాన్ని నిలబెట్టడం సంతోషదాయకమని.. చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు! ఆయన ఆనందం సంగతి కాసేపు పక్కనపెడితే… నిమ్మగడ్డ సీరియల్ ఇప్పట్లో ముగిసేది కాదని గవర్నర్ ప్రతిస్పందనను క్షుణ్ణంగా పరిశీలించినవారు చెబుతున్న సంగతి తెలిసిందే!

కాగా… న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పటికీ తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ‌గా కొనసాగించడం లేదంటూ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించిన అనంతరం స్పందించిన కోర్టు తీర్పుపైఇ ప్రతిస్పంది గవర్నర్… “హైకోర్టు తీర్పు మేరకు తగిన చర్య తీసుకోవాలి” అని ప్రభుత్వానికి సూచించారు.