గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. దరఖాస్తు ఎడిట్ కి సువర్ణవకాశం

-

తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. ఆ దరఖాస్తు లో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే ఛాన్స్ ఇచ్చింది. గ్రూప్ 2 అభ్యర్థులకు దరఖాస్తు ఎడిట్కు ఆప్షన్ ఇచ్చింది. ఈ నెల 16 నుండి 20 వ తేదీ వరకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ నెల 16న ఉదయం 10 గంటల నుంచి ఈ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. చివరి తేదీ ఈ నెల 20 సాయంత్రం 5 గంటల వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది.

ఈ అవకాశం చివరిదని.. మరో అవకాశం ఉండబోదని వెల్లడించింది. అందువల్ల అభ్యర్థులు ఈ సమయంలో ప్రతి విషయాన్ని జాగ్రత్త చెక్ చేసుకోవాలని సూచించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకునే అభ్యర్థులు ఎస్ఎస్సీ, ఆధార్ కార్డుకు సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. టీజీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షను ఆగస్టు 7,8 తేదీలలో నిర్వహించనున్నట్లు ఇదివరకే ప్రకటించింది. మొత్తం గ్రూప్ 2 పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news