అమరావతిలో విధ్వంసం సృష్టించి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలుగు జాతికి ద్రోహం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ రాజధానిపై శ్వేతపత్రం చేసిన ఆయన జగన్ చేసిన అరాచక వల్ల పెట్టుబడి దారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారి నమ్మకం కోల్పోయాక పెట్టుబడిదారులు మళ్లీ రమ్మంటే వస్తారా అని ప్రశ్నించారు. ఇప్పుడు వాళ్లను మళ్లీ రాష్ట్రానికి తీసుకురావలంటే చాలా కష్టతరమని చెప్పారు.
మరోసారి సమస్యలు రావని పెట్టుబడిదారుల్లో భరోసా, నమ్మకం కలిగించాలన్నారు. రాష్ట్రంలో ఇంతగా అరచకాలకు పాల్పడిన వ్యక్తి అసలు రాజకీయాలకు అర్హుడేనా అని ప్రశ్నించారు. ఏపీ అంటే ఒక రైస్ బౌల్ అని దేశంలో పేరుందని తెలిపారు. రాజధాని అమరావతికి మళ్లీ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడంపై ఆలోచనలు చేస్తున్నామని, జగన్ విధ్వంసం చేసిన శిథిలాల నుంచే బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. కష్టపడి పని చేసి సంపద సృష్టించాలని, ఉపాధి కాల్పించాలని, పేదరికాన్ని నిర్మిలించాలని ఏపీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.