Chandrababu Naidu Decides to Continue Free Sand Scheme from July 8: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రేపటి అంటే సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుందని అధికారులు తెలిపారు. అన్ని జిల్లాల్లో ఉన్న నిల్వ కేంద్రాల్లోని ఇసుక డంప్‌ల నుంచి అందజేయనుంది.
సీనరేజ్ మినహా మరే ఇతర వ్యయాలు ప్రజలపై మోపకుండా ప్రభుత్వం ఇసుక అందజేయనుంది. ఈ మేరకు సీఎస్ నీరబ్‌కుమార్ ఇసుక స్టాక్స్ అన్నీ ఆయా జిల్లాల కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
అయితే.. కొన్ని రూల్స్ పెట్టారు. ఒక మనిషికి ఒక రోజుకి ఆధార్ కార్డు మేరకు 20 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇవ్వనున్నారు. అటు ఉదయం 6 నుండి సాయంత్రం 6 గం.ల వరకు మాత్రమే ఇసుక ఇస్తారన్న మాట. డిజిటల్ పేమెంట్ ద్వారా మాత్రమే చెల్లింపులు ఉంటాయి.