ఎన్నికల్లో ఓడిపోతే మరీ ఇంత దిగజారిపోవాలా బాబు?

-

గడిచిన ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని.. తమ పాలనలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణవరకూ జగన్ వెళ్తున్నారని.. ఇప్పటికే అచ్చెన్నాయుడు వంటివారిని పోలీసులు పట్టుకెళ్లిపోయారని.. చంద్రబాబుకు రేపో మాపో ప్రధాన ప్రతిపక్ష హోదా పోబోతుందని.. చంద్రబాబుకు ఎలాంటి టెన్షన్ లేదు! ఇప్పుడు బాబుకున్న ఒక పెద్ద సమస్యతో పోలిస్తే… పైనవేవీ పెద్ద సమస్యలు కాదు!


అవును… చంద్రబాబుకు ప్రస్తుతం ఉన్న పెద్ద, అతి పెద్ద, అంతకుమించిన పెద్ద సమస్య ఏమైనా ఉందంటే… అది “బీజేపీ – వైకాపా” బంధం / “మోడీ – జగన్” ల బంధం!! ప్రస్తుతం బాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఒకే ఒక్క బలమైన సమస్య ఇది! దీంతో… తన స్థాయి తగ్గించుకుని, జనం నవ్వుతారన్న విషయం లెక్కచేయకుండా, నవ్విపోదురుగాక నాకేటి అన్న చంధంగా మోడీ – జగన్ ల మధ్య గ్యాప్ కోసం పిల్ల పనులు చేస్తున్నారు బాబు!

ఇంతకూ మోడీ – జగన్ ల మధ్య బాబు గ్యాప్ తీసుకురావాలంటే… జగన్ అసలు మోడీ మాట వినడం లేదని, మోడీ మాటలు పెడచెవిన పెడుతున్నారని… ఏపీలో బీజేపీ నేతలను ఒప్పించాలనేది ప్రయత్నం. అది కాస్త హస్తినకు చేరితే మోడీ.. జగన్ ను దూరం పెడతారేమో అని చిన్న ఆశ. అలా జగ్న ను దూరం పెట్టడం ఆలస్యం.. తాను వెళ్లి మోడీ చంకనెక్కొయ్యొచ్చనేది వారి తపన!! ఇంతకూ ఇందుకు బాబు ఎంచుకున్న మార్గాలు…  మందు షాపులు – స్కూళ్లు!!

అవును.. ప్రధాని చెప్పినట్లుగా వినకుండా మ‌ద్యం దుకాణాల‌ను తెర‌వాల‌ని, స్కూళ్ల‌ను తెర‌వాల‌ని ఏపీ ప్ర‌భుత్వం భావిస్తోంద‌ట‌.. ప్రస్తుతం మోడీకి జగ్న కు మధ్య పెట్టాలని భావిస్తోన్న బాబు ఎంచుకున్న విషయం ఇది. ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వం స్పందిస్తూ.. స్కూళ్ల‌ను తెర‌వ‌డం తెర‌క‌పోవ‌డం పూర్తిగా రాష్ట్ర ప్ర‌భుత్వాల ఇష్టం అని చెప్పింది. మరి చంద్రబాబు ఈ మాటలు వినలేదా లేక జనాలు వినలేదులే అని అనుకుంటున్నారా? ఎన్నికల్లో ఓడిపోతే మరీ ఇంత దిగజారిపోవాలా అనేది నెట్టింట కామెంట్!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news