బాబుకు లక్ష్మీపార్వతితోనే ఇబ్బంది…స్టేలు ఎక్కడా..?

-

‘చంద్రబాబు స్టేలు మీద బ్రతుకుతున్నారు’ బాబు రాజకీయ ప్రత్యర్ధులైన వారు మాట్లాడే మాట ఇదే.  ఎంతోకాలం ఉంచి ప్రత్యర్ధి పార్టీలు బాబు స్టేలు మీద బ్రతుకుతున్నారని, ఆ స్టేలు ఎత్తేస్తే జీవితాంతం జైలులోనే గడుపుతారని మాట్లాడుతుంటారు. ఇక బాబు మీద ఉన్న స్టేల గురించి తాజాగా ఏపీ స్పీకర్, వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం మాట్లాడారు. 26 కేసుల్లో స్టే ఉత్తర్వులు తెచ్చుకున్న చంద్రబాబుకు దమ్ముంటే ఆ కేసులపై విచారణ చేయించుకోవాలని, చంద్రబాబును ఏక్షణంలో మూసేస్తారో తెలియదని అన్నారు.


అయితే ఇలా ప్రతి ఒక్కరూ స్టేలు గురించే మాట్లాడుతూ రాజకీయంగా బాబుని దెబ్బ తీయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి చూసుకుంటే బాబు మీద ఉన్న కేసులు చాలా తక్కువ అని, ఓ టీడీపీ అనుకూల మీడియా బాగా హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. అసలు చంద్రబాబు మీద ఉన్న కేసులు లెక్కలన్నీ బయటకు తీసి, వాటిలో వాస్తవం ఎంత అనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేసింది. దాదాపు బాబు మీద 20 కేసులు ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన కేసులే ఎక్కువ.

అయితే దాదాపు బాబు మీద కేసులన్నీ కొట్టేశారని, కాబట్టి అవి లెక్కలో లేవని చెబుతున్నారు. కానీ బాబు మీద ప్రస్తుతం ఉన్న కేసులు వచ్చి లక్ష్మీపార్వతి వేసిన కేసు ఒకటి, అలాగే బాబ్లీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉన్నాయి. చంద్రబాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి ఎప్పుడో కేసు వేశారు. దానిపై బాబు స్టే కూడా తెచ్చుకున్నారు. అయితే ఇటీవల సుప్రీం కోర్టు స్టేలు వేకెట్ చేయాలని చెప్పడంతో, ఈ కేసుపై విచారణ మొదలైంది.

ప్రస్తుతం ఇది హైకోర్టు పరిధిలో ఉంది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా బాబ్లీ ప్రాజెక్ట్‌ను సందర్శించిన కేసులో భాగంగా చంద్రబాబు మీద ఓ కేసు ఉంది. ఇక ఇవి తప్పితే బాబు మీద కేసులు లేవని, వైఎస్సార్, విజయమ్మ, కాంగ్రెస్ నేతలు వేసిన కేసులని కొట్టేశారని టీడీపీ అనుకూల మీడియా చెబుతోంది.

-Vuyyuru Subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version