కృష్ణా నదిపై కొత్త రైల్వే బ్రిడ్జి – సీఎం చంద్రబాబు

-

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా నదిపై వస్తున్న కొత్త రైల్వే బ్రిడ్జిని ఒక ఐకానిక్ బ్రిడ్జి గా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

ఈ కొత్త రైల్వే లైన్…దేశంలో ఇతర రాష్ట్ర రాజధానులు అయిన హైదరాబాద్, చెన్నె మరియు కోల్‌కతా లను అనుసంధానం చేస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ నూతన రైల్వే బ్రిడ్జిని ఐకానిక్ బ్రిడ్జి గా తీర్చిదిద్దాలని రైల్వే మంత్రిని కోరుతున్నానని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

ముఖ్యంగా ఏపీలో చేపట్టబోయే అన్ని ప్రాజెక్టులకు మరో మూడు నెలల్లోనే భూ సేకరణ పూర్తి చేయనున్నట్టు.. ఈ మేరకు అధికారులకు ఉత్వర్వులు కూడా జారీ చేసామని తెలిపారు. రూ.18వేల కోట్లతో చేపడుతున్న బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్ ప్రెస్ కారిడార్ లో కొన్ని సమస్యలున్నాయని తెలిపారు. అయినప్పటికీ వాటిని అధిగమించి.. నిర్ణీత గడువు లోపు పనులను పూర్తి చేస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news