మహారాష్టలో తేలుతున్న పొత్తుల లెక్కలు.. ఇక సమరమే అంటున్న కూటమి పార్టీలు..

-

మహారాష్టలో సీట్లు షేరింగ్ లెక్కలు తేలుతున్నాయి.. మహా వికాస్ అఘాడియా కూటమి సీట్ల లెక్కలు ఒక కొలిక్కి వస్తున్నాయి.. మరో రెండు రోజుల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందన్నదానిపై పూర్తిగా క్లారిటీ రాబోతుంది.. కూటమి పార్టీలతో శరద్ పవార్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.. కాంగ్రెస్ కు, ఉద్దవ్ వర్గానికి మధ్య సీట్లు సర్దుబాటును ఆయన చక్కదిద్దుతున్నారు.. మరోవైపు మహాయుతి కూటమి ఇప్పటికే సీట్లు ఖరారు అయ్యాయి..

మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.. అయినప్పటికీ మహావికాస్ అఘాడియా కూటమిలో సీట్ల పంచాయతీ ఇంకా ఒక కొలిక్కి రాలేదు.. సీట్లు షేరింగ్ పై కూటమి నేతల మధ్య సయోధ్య ఇంకా కుదర్లేదు.. దీంతో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.. మరో రెండు రోజుల్లో చర్చలు కొలిక్కి వచ్చే అవకాశముందని పార్టీల నేతలు చెబుతున్నారు.. కాంగ్రెస్, ఉద్దవ్ థాక్రే వర్గానికి మధ్య శరద్ పవార్ చర్చలు జరుపుతున్నారు.. కేవలం 40 సీట్లలో ఏకాభిప్రాయం కుదరడం లేదని.. రెండు రోజుల్లో క్లారిటీవచ్చే ఛాన్స్ ఉందని నేతలు అంటున్నారు..

కాంగ్రెస్ 105-110 సీట్లు, ఉద్దవ్ థాక్రే వర్గం 90-95, పవార్ వర్గం 75-80 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.. అయితే విదర్బలోని 65 సీట్లలో మెజార్టీ కోసం కాంగ్రెస్, ఉద్దవ్ వర్గం పట్టుబడుతోంది. ఈ ప్రాంతంలో తాము ఆరు ఎంపీ సీట్లు గెలిచామని.. కాబట్టి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు తమకే ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది.. అయితే తమకు విదర్బలో 16 సీట్లు ఇవ్వాలని ఉద్దవ్ వర్గం డిమాండ్ చేస్తోంది.. దీంతో శరద్ పవార్ వారి మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను తీసుకున్నట్లు తెలుస్తోంది..మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రాబోతుందని టాక్ వినిపిస్తోంది..

మరోవైపు మహాయుతి కూటమిలో సీట్లు సర్దుబాటు పూర్తయింది.. 288 సీట్లలో బిజేపీ 156 సీట్లు, శివసేన షిండే వర్గం 78 నుంచి 80 సీట్లలో పోటీ చెయ్యబోతుంది.. అజిత్ పవార్ వర్గం 53 నుంచి 54 సీట్లలో పోటీ చేసే అవకాశముంది.. 2.109 అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపీ స్వంతంగా 109 సీట్లలో విజయం సాధించింది.. అయితే గెలుపుపై రెండు కూటములు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి.. సమర్దవంతమైన నేతల్ని బరిలోకి దింపి..అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news