ఏపీలో బలోపేతం దిశగా బిజెపి.. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న కమలనాథులు..

-

ఆంధ్రప్రదేశ్లో సొంతంగా కమలం జెండాను ఎగరవేయడం బిజెపి అగ్రనాయకత్వం ముందున్న ఏకైక లక్ష్యం.. ఇందుకోసం గత కొన్నేళ్లుగా బీజేపీ ఎదురుచూస్తోంది.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా ఉండేది.. అత్యధిక ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకునేది.. అసెంబ్లీలో సైతం కాంగ్రెస్ టిడిపి సభ్యులే ఉండేవాళ్లు.. అయితే ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయనే వాదన తెరమీదకు వస్తోంది.. గత ఎన్నికల్లో టిడిపి బిజెపి జనసేన కలిసి పోటీ చేసాయి.. ఇందులో బిజెపి పది చోట్ల పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలుపొందింది.. ఓటు షేర్ కూడా అనూహ్యంగా పెరిగింది..

ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలుగా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బిజెపిలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది.. ఆమె కేడర్ ను ఏకం చేసి పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు.. ఈ క్రమంలోనే టిడిపి జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది.. పోటీ చేసిన ఎనిమిది చోట్ల బిజెపి అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలుపొందారు.. వారి విజయం బిజెపి అగ్ర నాయకత్వంలో ఆశలు రేకెత్తించాయి.. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే దిశగా అగ్రనాయకత్వం అడుగులు వేస్తోంది.. ఏపీలో సొంతంగా ఎదగాలనే ఆలోచనలో బిజెపి నేతలు ఉండడంతో.. పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోందట..

బిజెపి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో మంత్రులయ్యారు.. ఇదే క్రమంలో కేంద్రంలో కూడా బిజెపి ఎంపీలకు సముచిత స్థానం కల్పించాలని భావనలో కమల్నాథులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది.. దాంతోపాటు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఏపీకి భారీగా నిధులు ఇచ్చాం అనే సంకేతాలను ఏపీలో విస్తృతంగా ప్రచారం చేయాలని బిజెపి క్యాడర్ కు అగ్రనేతలు సూచించారట..

ఏపీలో కూడా సొంతంగా అధికారంలోకి వస్తే.. గుజరాత్ తరహా అభివృద్ధి చేస్తామని.. ప్రజలకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించాలని రాష్ట్ర నాయకత్వానికి పార్టీ పెద్దలు ఆదేశించారనే టాక్ నడుస్తోంది.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను నమ్ముకుంటే ఏపీలో పాగా వేయడం సాధ్యం కాదని కమలనాధులు భావిస్తున్నారట.. మరో ఆరు నెలలలో ఏపీ నాయకత్వానికి కీలక సమావేశం ఉంటుందని జోరుగా ప్రచారం నడుస్తుంది. మొత్తంగా ఏపీలో బీజేపీ సొంతంగా పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news