బాబు దృష్టిలో మర్డరైపోయిన వ్యక్తి ఎవరు?

అధికారపార్టీ ఏమి చేసినా దానిపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం అత్యంత సహజమే కానీ.. అవినీతి చేసినవారు, అక్రమాలకు పాల్పడినవారు, మర్డర్ కేసుల్లో ప్రమోయం ఉన్నవారి విషయంలో కూడా ప్రతిపక్షాలు అల్లర్లు చేయడం, కులం కార్డులు తీయడం జరుగుతున్న రోజులివి! అచ్చెన్నాయుడు అరెస్ట్ అయితే అది బీసీలపై దాడిగా అభివర్ణించిన టీడీపీ నేతలు.. తాజాగా ఒక హత్యకేసులో ప్రమేయం ఉందనే విషయంపై కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకితీసుకుని, దానిపై జిల్లా ఎస్పీ వివరణ ఇచ్చినా కూడా… బీసీ కార్డు బయటకు తీస్తున్నారు!


ఈ విషయంలో మైకులందుకున్న టీడీపీ నేతలు… బీసీలను అణగదొక్కడానికే జగన్ కంకణం కట్టుకున్నారని, బీసీలను రాష్ట్రం నుంచి పంపించేయాలని జగన్ ఫిక్సయ్యారని.. నోటికొచ్చిన విమర్శలన్నీ చేసేస్తున్నారు! అవినీతి కేసులో అచ్చెన్నాయుడిని, మర్డర్ కేసులో రవీంద్ర ని అరెస్టు చేస్తే… బీసీలందరికీ అన్యాయం జరిగిందని, ఏకంగా రాష్ట్రం నుంచి బీసీలను పంపించేదిశగా జగన్ ఆలోచనలు చేస్తున్నారని అనడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

ఆ సంగతులు అలా ఉంటే… అసలు బాబు దృష్టిలో బీసీలంటే ఎవరు? టీడీపీలో ఉన్న బీసీ నేతలు మాత్రమే బీసీలా? ఒక బీసీ అయిన అచ్చెన్నాయుడు అవినీతి కేసులో అరెస్టయిన ఈ.ఎస్.ఐ. స్కాంలో అధికంగా కార్మికులు బీసీలు ఉండరా? కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందని చెబుతున్న మర్డర్ కేసులో మర్డరైపోయిన వ్యక్తిది ఏ సామాజిక వర్గమో టీడీపీ నేతలకు తెలియదా? మర్డరైపోయిన వ్యక్తి తరుపున మాట్లాడరు సరికదా.. ఆ మర్డర్ లో ప్రమేయం ఉందని పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తికి మాత్రమే బీసీ కార్డు అంటగడతారు!! బాబు దృష్టిలో… బీసీ నేత మర్డర్ అయిపోయినా.. ఆయన బీసీ కాదు.. ఎందుకంటే ఆయనమెడలో పసుపు కండువా లేదు కదా! అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి!