చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో టీచర్ల అక్రమ బదిలీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్. ఉపాధ్యాయుల బదిలీలపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు జరిగిన టీచర్ల అక్రమ బదిలీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గత ప్రభుత్వ హయాంలో టీచర్ల బదిలీలలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక్కొక్క బదిలీకి రూ.3 నుంచి 4 లక్షలు తీసుకున్నారని పలువురు మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన ప్రభుత్వం బదిలీలను రద్దు చేసింది.
- ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు-ఉత్తర్వులు విడుదల
- ఫిబ్రవరి 2024 నుండి జూన్ 2024 వరకు జరిగిన
- ఉపాధ్యాయుల ప్రభుత్వ బదిలీలు రద్దు
- నేడు ఉత్తర్వులను విడుదల చేసిన విద్యాశాఖ