చంద్రబాబు సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు..?

-

చంద్రబాబు సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి… చాలా పథకాలకు పేర్లు పెట్టారు. కీలక మార్పులు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాల పేర్లు అలాగే… ప్రాజెక్టుల పేర్లు మార్చుకుంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుంది. ఇప్పటికే చాలా పథకాల పేర్లు మారిపోయాయి. ఇటీవల ప్రాజెక్టుల పేర్లను కూడా మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం.

Chandrababu Sensational Decision Name Change of Secretariat System

అయితే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అతి త్వరలోనే గ్రామ మరియు వార్డు సచివాలయాల ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధం చేసింది నాయుడు ప్రభుత్వం. ఇందులో భాగంగానే గ్రామ మరియు వార్డు సచివాలయాల పేర్లను మార్చాలని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా మార్చాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై అతి త్వరలోనే కేబినెట్లో చర్చించి అధికారిక ప్రకటన చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ గ్రామ సంక్షేమ కార్యాలయాల్లోనే… ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోనుంది చంద్రబాబు ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version