తిరుమల వెళ్లే భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై క్యూలైన్లలో ఆ సమస్యలకు బ్రేక్!

-

తిరుమల శ్రీవారి దర్శనానికి లక్షల్లో జనాలు వెళుతూ ఉంటారు. రోజుకు 70 వేల నుంచి లక్ష వరకు దర్శించుకుంటూ ఉంటారు. ఈ తరుణంలో తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు 12 గంటల నుంచి 24 గంటల సమయం పడుతుంది. ఏదో కొన్ని రోజుల్లో మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది. అయితే.. తిరుమల దేవస్థానం దర్శనం కోసం వచ్చే భక్తులకు టిటిడి శుభవార్త చెప్పింది.

తిరుమల కొండ పైన ఉన్న.. రింగ్ రోడ్డులో సర్వదర్శనం క్యూలైన్ల నిర్మాణం… త్వరగా చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం తిరుమల లోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణ షెడ్ల ద్వారా శ్రీవారి దర్శనానికి పంపిస్తున్నారు. అయితే ఆ మార్గంలో సరిగా ఫ్యాన్లు అలాగే లైట్లు లేవట. మూత్రశాలలు కూడా పనిచేయడం లేదట. వర్షం పడితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట తిరుమల శ్రీవారి భక్తులు. అయితే.. రింగ్ రోడ్డు పైన ఉన్న క్యూలైన్ నిర్మాణం… చాలా వేగంగా నిర్వహిస్తోంది టిటిడి పాలక మండలి. మరో నెల రోజుల్లోనే ఈ పనులను పూర్తి చేసి దర్శనాలు కూడా ప్రారంభించాలని అనుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version