పరిపాలనలో ప్రక్షాళన ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు….సీఎంఓ, సీఎస్, డీజీపీలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారుల బదిలీలపై కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారుల జాబితాను ఇప్పటికే సిద్దం చేసిన ఏపీ సీఎంఓ….సమర్థులైన అధికారులకు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగులు ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. వైసీపీతో అంటకాగిన వారిని దూరంగా పెట్టనున్నారట చంద్రబాబు.
ప్రవీణ్ ప్రకాష్, శశి భూషణ్, అజేయ్ జైన్, శ్రీలక్ష్మీ, గోపాల కృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీకి రిపోర్ట్ చేయమంటారని చర్చ జరుగుతోంది. సీనియర్ ఐపీఎస్సులు రాజేంద్రనాధ్ రెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, ఎన్. సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటు పడే ఛాన్స్ ఉందని సమాచారం. జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారులపై కేసులు కూడా నమోదు చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉందని సమాచారం. 5 హామీలపై అమలుపై ప్రణాళికతో, వేగంగా పని చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నిర్ణయం వెలువడిన తరువాత జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. అటు టీటీడీ ప్రక్షాళనతో పని మొదలు పెట్టిన చంద్రబాబు….ధర్మారెడ్డిని తప్పించి.. ఈవోగా సీనియర్ ఐఎఎస్ శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు.