మీ తాత జాగిరి కాదు..పెద్దిరెడ్డికి వడ్డీతో సహా చెల్లిస్తా – చంద్రబాబు వార్నింగ్

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వడ్డీతో సహా పెద్దిరెడ్డికి చెల్లిస్తానని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.పదవులు, ఇసుక,మద్యం, కాంట్రాక్టులు పనుల ఏ ఒక్కటి వదలకుండా పెద్దిరెడ్డి కుటుంబం దోచుకుంటోందని ఫైర్ అయ్యారు. రైతులకు మంచి రోజులు రావాలంటే టిడిపి రావాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేదు…టమోటా ధర డమాల్ అని పడింది…అయిన ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు.

 

ఏపీలో తెలుగుదేశం పార్టీ నిర్వ‌హిస్తున్న మినీ మ‌హానాడుల్లో భాగంగా చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో మినీ మ‌హానాడు బుధ‌వారం సాయంత్రం ప్రారంభ‌మైంది. ఈ స‌భ‌కు భారీ సంఖ్య‌లో టీడీపీ శ్రేణులు, ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు. అయితే ఈ కార్యక్రమంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మూడేళ్ళగా ఒక్కచుక్క నీరు అయినా చిత్తూరు జిల్లాకు వైసిపి నేతలు ఇచ్చారా ? అని నిలదీశారు. రాజంపేట పార్లమెంట్ పెద్దిరెడ్డి తాతా జాగీరు కాదు..దాడి చేయడం మీకే వచ్చా.. మాకు చేతకాదా ? ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు నారా చంద్రబాబు నాయుడు.