ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పాలనపై సచివాలయం కేంద్రంగా చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. అన్ని శాఖలకు సంబంధించి ఆయా ఉన్నతాధికారులతో ఇప్పటికే సమీక్షలు నిర్వహించారు. సమయ పాలన కచ్చితంగా పాటించాలని ప్రభుత్వ ఉద్యోగులను ఆదేశించారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులకు అనుకూలంగా పని చేసిన అధికారులను బదిలీ చేశారు. అనంతరం ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి పాలనను మరింత పరుగులెత్తించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
పత్రిపక్షంలో ఉన్నప్పుడు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆయన కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు అయ్యాడు కాబట్టి ఆ కార్యాలయాన్ని సందర్శించాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరి టీడీపీ కేంద్రానికి వెళ్లారు. సీఎం అయిన తర్వాత తొలిసారి అక్కడకు వెళ్లడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. సీఎం చంద్రబాబును తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జై తెలుగుదేశం.. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి ఫొటోలు దిగారు. బిజీ షెడ్యూల్లో కూడా టీడీపీ శ్రేణులతో సరదాగా చంద్రబాబు గడిపారు. ఈ సందర్భంగా పలువురు ఇచ్చిన వినతులను సైతం తీసుకున్నారు. పరిష్కారం చేసేందుకు హామీ ఇచ్చారు.