తెలుగుదేశం పార్టీకి గుడ్ న్యూస్. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఏపీ స్కీల్ డెవలప్మెంట్ స్కాం లో భాగంగా చంద్రబాబు నాయుడుకు ఇవాళ బెయిల్ వచ్చింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కేవలం నాలుగు వారాల పాటు మాత్రమే చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.
అనారోగ్యం కారణంగానే ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. చంద్రబాబుకు వచ్చే నెల 24వ తేదీ వరకు బెయిల్ మంజురు చేసింది కోర్టు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. అలాగే పబ్లిక్ మీటింగ్లు పెట్టొద్దని చంద్రబాబుకు షరతులు జారీ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 28కి వాయిదా వేసింది కోర్టు. ప్రధాన బెయిల్ పై నవంబర్ 10న విచారణ సాయంత్రం 5 – 7 గంటల మధ్య చంద్రబాబు విడుదల కానున్నారు.కాగా 52 రోజుల కిందట చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.