ఏపీలో రోడ్ల దుస్థితిపై చిన్న జీయర్ స్వామి హాట్ కామెంట్స్

-

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలి కాలంలో బాగా విమర్శలకు లోనవుతున్న విషయం అద్వానంగా ఉన్న రోడ్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ పరిస్థితి పై చాలాకాలంగా ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ ని టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గుంతల మయం అయిన రోడ్లపై వినూత్నమైన నిరసన తెలియజేసి, రోడ్లను తక్షణం మారమ్మత్తు చేయాలని వైసిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇక ఏపీ లో రోడ్ల దుస్థితి పై తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయడానికి వెళ్లిన చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం గా మారింది.

ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీ ఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆహ్వానంతో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్ స్వామి పర్యటించారు. రాజమండ్రిలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసే సమయంలో, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్ల దుస్థితి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వరకు ప్రయాణం చేయడానికి తనకు మూడు గంటల సమయం పట్టింది అని వ్యాఖ్యానించిన చిన్న జీయర్ స్వామి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు.

ప్రయాణంలో ఇంతగా ఇబ్బంది ఎదుర్కోవడానికి బహుశా రోడ్లమీద గోతులు ఎక్కువగా ఉండవచ్చు అంటూ చలోక్తులు విసిరారు. ఇక చిన్న జీయర్ స్వామి చేసిన హాట్ కామెంట్స్ తో ఇప్పటికే ఏపీలో రోడ్ల పరిస్థితి పై మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీలకు మరో ఆయుధం దొరికినట్లు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news