రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా చోట్ల వరదలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని వరదలపై సర్వే చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముంపు బాధితుల ఇబ్బందులు ప్రత్యక్షంగా చూసాను. బాధితులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటా. ఇంత వరదను ఊహించలేదు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి వరదలు చూడలేదు. అవసరమైతే మళ్ళీ వస్తా. అధికారులను అందుబాటులో ఉంచుతా అని పేర్కొన్నారు.
అలాగే నేను ప్రతీ ఒక్కరి కష్టాన్ని చూసాను. అందరికీ ఆహార పదార్థాలు సరఫరా చేస్తాం. లోతట్టు ప్రాంతాల వారు దగ్గరి లోని పెద్ద బిల్డింగులోకి వెళ్ళండి. పెద్ద బిల్డింగుల వాళ్ళు పెద్ద మనసుతో అందరికీ సహకరించాలి. బోట్లు లేకపోవటం వల్ల కొంత జాప్యం జరుగుతుంది. గంట గంటకు పరిస్థితి మానిటర్ చేస్తాను. 24/7 అందుబాటులో ఉండి అందరూ సురక్షితంగా బయట పడే వరకు విశ్రమించను అని సీమ చంద్రబాబు తెలిపారు.