బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాలు, వరదల ముప్పు పెరుగుతోంది. దీంతో వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇక భారీ వర్షాలతో ఏపీతో పాటు తెలంగాణ అతలాకుతలమవుతోంది. తెలంగాణలో నెలకొన్న విపత్కర పరిస్తితులను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.
మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు వాగు బ్రిడ్జీ వద్ద దాదాపు 20 మంది వరకు చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పంపించాలని బండి సంజయ్ కోరారు. వీరిని సురక్షితంగా కాపాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 110 గ్రామాలు పూర్తిగా వరదల్లో చిక్కుకుపోయాయని వివరించారు బండి సంజయ్. మున్నేరు వాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లను పంపిస్తామని హామీ ఇచ్చారు అమిత్ షా. దీంతో ఏపీ నుంచి హెలికాప్టర్లు వచ్చాయి. మున్నేరువాగులో చిక్కుకున్న దాదాపు 20మందిని కాపాడారు ఫైర్ సిబ్బంది.