సీఎం చంద్రబాబు ఇంటికి వరద ముంపు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఇంట్లోకి వరద చేరే అవకాశం ఉన్నట్లు వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. కృష్ణానదికి భారీగా వస్తున్న వరదతో ప్రమాదంలో చంద్రబాబు ఇల్లు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. కరకట్ట, కృష్ణానది మధ్యలో సీఎం చంద్రబాబు ఉన్నారు.
గతంలో వరద నీరు తన ఇంట్లోకి వచ్చేలా చేశారంటూ హడావుడి చేశారని చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఇప్పుడు 5.83 లక్షలకు చేరింది వరద. అంటే గతం కంటే ఎక్కువ. ఇప్పటికే చంద్రబాబు నివాస ప్రాంగణంలోకి చేరిందట వరద నీరు. మరో 20 వేల క్యూసెక్కుల వరద వస్తే
ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. సీఎం నివాసంలోకి వరద చేరకుండా అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారట. ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ పూర్తిగా ఎత్తి వరద నీటిని కిందకు వదులుతున్నారట అధికారులు.