కుండపోత.. కడెం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత

-

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండ్రోజులుగా రాష్ట్రంలో గ్యాప్ ఇవ్వకుండా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు, చెరువులు నిండుకున్నాయి. దీనికి తోడు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు కొనసాగుతోంది.ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండుకుండను తలిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం700 అడుగులుగా ఉంటే, ప్రస్తుతం 694.700 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు మొత్తం నిండుకుండలా దర్శనమిస్తోంది. దీంతో కడెం ప్రాజెక్టు ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 52,713 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 48,701 క్యూసెక్కులుగా ఉంది. ఇదిలాఉండగా, ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news