ఫేక్ సదరం సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తాజాగా వైద్యారోగ్యశాఖ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఫేక్ సదరం సర్టిఫికెట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంగవైకల్యంతో బాధపడేవారికి వివిధ రూపాల్లో పెన్షన్ అందిస్తున్నామని.. సదరం ఫేక్ సర్టిఫికెట్ల జారీ పై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఫేక్ సదరం సర్టిఫికెట్ల గురించి పూర్తి స్తాయిలో సమాచారం సేకరించాలన్నారు.
పంచాయతీ రాజ్ శాఖతో సమన్వయం చేసుకొని ఫేక్ సదరం సర్టిపికెట్ల కట్టడికీ చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోనే బెస్ట్ హాస్పిటళ్లుగా సర్కారు దవఖానాలను తీర్చిదిద్దాలని సూచించారు. వైద్యారోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని.. టెలి మెడిసిన్ మెరుగైన వైద్యసేవలందించాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను భ్రష్టు పట్టించడంతో ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందన్నారు