తెలంగాణలో కొత్త స్టాటజీ ఫాలో అవుతున్న బిజేపీ.. వర్కౌట్ అవుతుందా..?

-

ఏపీలో పాగా వెయ్యాలని భావించిన బిజేపీకి.. టీడీపీ,జనసేనలతో పెట్టుకున్న పొత్తు పుల్ మీల్స్ పెట్టింది.. ఆశించిన స్తాయిలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను తెచ్చిపెట్టింది.. దీంతో ఏపీలో బలోపేతం దిశగా బిజేపీ అడుగులు వేస్తోంది.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రచారం కల్పించాలని ఏపీ రాష్ట నాయకత్వానికి బిజేపీ ఆదేశాలు జారీ ఇస్తోంది.. ఇదే సమయంలో తెలంగాణాలో కూడా మరో అడుగు ముందుకు వెయ్యబోతోంది.. ఏపీలో సక్సెస్ అయిన ఫార్మూలాను అక్కడ కూడా ప్రయోగించబోతుందన్న ప్రచారం నడుస్తోంది..

ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని సక్సెస్ అయిన బిజేపీ.. తెలంగాణాలో కూడా అదే స్టాటజీని పాలో అవ్వాలని భావిస్తోందట.. రాబోయే స్థానిక సంస్త ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని తమ సత్తా చాటేందుకు కమలానాధులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని టాక్ నడుస్తోంది.. ఏపీలో బలంగా ఉన్న వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసిన ఈ జోడీ.. తెలంగాణాలో కాంగ్రెస్ దూకుడుకు బ్రేక్ వేసేందుకు సిద్దమవుతున్నారట.. తెలంగాణాలో జనసేన లేకపోవడంతో.. ఆ రెండు పార్టీలే కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పొలిటికల్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి కాంగ్రెస్ ను చావు దెబ్బ తీయాలని భావిస్తున్నాయట..

తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుని.. పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు సాధించి మంచి ఊపుమీదున్న కాంగ్రెస్ ను ఆ రెండు పార్టీలు డీకొట్టాలంటే అంత ఈజీగా కాదనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.. కానీ ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు మాత్రం కాంగ్రెస్ ను ఢీకొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.. గత అసెంబ్లీఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చెయ్యలేదు.. బీఆర్ ఎస్ ను ఓడించేందుకు.. కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతు ఇచ్చిందనే వాదనలు అప్పట్లో వినిపించాయి..అది నిజం కూడా.. టీడీపీ పోటీ చేసి ఉంటే.. కాంగ్రెస్ ఓట్లు చీలిపోయేవి.. అలా జరక్కుండా రేవంత్ రెడ్డి జాగ్రత్త పడ్డారట.. ఎన్నికలకు ముందు చంద్రబాబును కలిసి.. పోటీ చెయ్యొద్దని విజ్ణప్తి చేశారని.. అందుకే చంద్రబాబు ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారని ప్రచారం నడుస్తోంది..

అయితే ఈసారి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజేపీతో కలిసి పోటీ చెయ్యాలని టీడీపీ భావిస్తూ ఉండటం.. కాంగ్రెస్ కు షాక్ అనే చెప్పాలి.. ఈ పొత్తు కొలిక్కి వచ్చిన తర్వాత దీనిమీద కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news