శాసనసభ బీఏసీ సమావేశం ముగిసింది. ఇందులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు అన్నారు. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతమైన చర్చ జరపడం సభ్యుల బాధ్యత. 1995లో తెల్లవారుజామున 4 గంటలకు ముందు రోజు రాత్రి భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయ్. కాబట్టి ఎమ్మెల్యేలు విధిగా అసెంబ్లీకి హాజరై సీరియస్ గా తీసుకోవాలి. చీఫ్ విప్, విప్ లను రేపు ఖరారు చేస్తాం అన్నారు.
ఇక శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ నెల 22వరకూ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. అసెంబ్లీ సమావేశాలు సీరియస్ గా జరగాలి. రేపు బడ్జెట్ పై అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు ఉంటాయి. శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయం బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు రెండు పూటలా అసెంబ్లీ ఉంటుంది అని స్పష్టం చేసారు.