కేటీఆర్ ఢిల్లీ పర్యటన మీద సంచలన వాఖ్యలు చేసారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫార్ములా ఈ రేసింగ్ అక్రమాలపై కేటీఆర్ మీద ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా కేటీయారే కార్ రేసింగ్ కి డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. తనను కాపాడుకునేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నాడు. కేటీఆర్ తప్పు చేయకుంటే విచారణకు సహకరించాలి. అమృత్ పథకం అక్రమాలంటూ కేటిఆర్ ఢిల్లీ వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికైన కేటీఆర్ తప్పు ఒప్పుకుంటే మంచిది. అమృత్ పథకం లో అక్రమాలంటూ ఢిల్లీ లో బీజేపీ తో దోస్తీ చేసేందుకు వెళ్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో అక్రమాల పై చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తున్నాము అని మంత్రి అన్నారు. అయితే ఢిల్లీలో రేపు కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను కలవనున్న కేటీఆర్.. అమృత్ పథకం టెండర్లలో అవినీతి జరిగిందని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బంధువు సృజన్ రెడ్డికి అక్రమంగా అమృత్ పథకం టెండర్లు దక్కాయని గతంలో ఆరోపించారు కేటీఆర్.