హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఇంటింటా జాతీయ జెండా ఎగరాలి. రేపు 78వ స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకుంటున్నాం. 2047 నాటికి వందేళ్ల ఉత్సవాలను జరుపుకుంటాం అని గ్రామస్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్, విజన్-2047 లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. రేపు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరేసి యువత, ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలి. సమరయోధులకు నివాళులర్పించాలి.
దేశాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు సమానమన్న అభిప్రాయాన్ని తీసుకురావాలి. జాతీయ జెండాను రూపకర్త మన తెలుగువారైన పింగళి వెంకయ్య. ఇది తెలుగుజాతికి గర్వకారణం. దేశానికి స్వాతంత్ర్యం అనంతరం అంచలంచలుగా దేశాన్ని నాయకులు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు.. దాన్ని కొనసాగించడంతోపాటు మరింత ముందుకు తీసుకెళ్లాలి. జాతీయ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో ఇనుమడించాలి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.