ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ సీప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు… ఇవాళ సీప్లేన్ ట్రయల్ రన్ ఉన్న నేపథ్యంలోనే… సీప్లేన్ లో విజయవాడ నుంచీ శ్రీశైలం వెళ్ళనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు కేంద్ర పౌర విమాన యాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు కూడా జయవాడ నుంచీ శ్రీశైలం వెళ్ళనున్నారు. ఇక ఇవాళ ఉదయం 10:30 కు పున్నమి ఘాట్ వద్దకు సీఎం చంద్రబాబు చేరుకుంటారు.

12 గంటలకు బయలుదేరి సీప్లేన్ లో శ్రీశైలం కు సీఎం చంద్రబాబు వెళతారు. శ్రీశైలంలో మల్లేశ్వరస్వామి దర్శనం చేసుకోనున్నారు సీఎం చంద్రబాబు. శ్రీశైలం నుంచీ విజయవాడకు తిరిగి సీ ప్లేన్ లో సీఎం చంద్రబాబు రానున్నారు. ట్రయల్ రన్ సక్సెస్ అనంతరం రాష్ట్రంలో 8 ప్రాంతాలలో పర్యాటక ఆకర్షణగా సీప్లేన్ లను నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.