45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి కూటమిని గెలిపించారు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే పక్క రాష్ట్రాల్లో పెన్షన్ లు చాల తక్కువుగా ఇస్తున్నారు. మన పక్క గ్రామం కర్ణాటక లో వుంది అక్కడ కేవలం 1200 రూపాయిలు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి . ఎన్ని పాపాలు చేయాలో అన్ని చేశారో. ఎక్కడికక్కడ అప్పులు చేసారు. చివరకు తహసీల్దార్ కార్యాలయలు తాకట్టు పెట్టే పరిస్థితికి గత ప్రభుత్వం తయారయింది.
ఒకప్పుడు నాసిరకం మద్యం దొరికేది. ఇప్పుడు ఇక్కడే మంచి మద్యం దొరికింది. కానీ బెల్ట్ షాపులు పెడితే… బెల్ట్ తీస్తా. మద్యం దుకాణాల విషయలో నాయకులు , దందాలు చేసే వారు దూరితే వారిని వదలను అని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో కరెంట్ సమస్యలు లేకుండా నేమకల్లు గ్రామంలో అందరికీ సోలార్ ప్యానల్ ఏర్పాటు చేస్తాం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేసారు.