జాతీయ-అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా మారింది : సీఎం జగన్

-

జాతీయ-అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా మారిందని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. విశాఖలో రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో భాగంగా.. 16 పారిశ్రామిక యూనిట్లను వర్చువల్‌గా ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ మాట్లాడుతూ, పెట్టుబడులతో ఏపీ అభివృద్ధి చెందుతుందని వివరించారు.

ఏపీ అభివృద్ధికి 15 సెక్టర్లు అత్యంత కీలకం, జాతీయ-అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా మారిందని ప్రకటించారు సీఎం జగన్. ఈ సమావేశంలో వంద మందికిపైగా స్పీకర్స్ పాల్గొన్నారని…, మొత్తం 352 MOUలు జరిగాయని వివరించారు. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని ప్రకటన చేశారు. రూ.8,84,823 కోట్ల పెట్టుబడులు ఎనర్జీ రంగంలో వచ్చాయి, పర్యాటక రంగంలో 117 MOUలు జరిగాయన్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news