ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ..!

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా ముందస్తు ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముందస్తు ఎన్నికల కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా ఢిల్లీలో పర్యటిస్తున్నారని, కేంద్రంలోని పెద్దలతో ముందస్తు ఎన్నికలపై మంతనాలు జరుపుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే నేడు కేబినెట్ భేటీలో ముందస్తు ఎన్నికల గురించి క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్.

రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతామని కేబినెట్ లో మంత్రులకు స్పష్టం చేశారు. మంత్రులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం మాత్రమే ఉందని.. 9 నెలలు కష్టపడితే గెలుపు మళ్లీ మనదేనని అన్నారు. “9 నెలల పాటు కష్టపడండి.. మిగిలింది నేను చూసుకుంటా” అని మంత్రులకు సీఎం కి జగన్ దిశానిర్దేశం చేశారు. దీంతో ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు ఇక చెక్ పడినట్లేనని భావిస్తున్నారు.