కేసీఆర్ చేసిన ఆ తప్పు.. సీఎం జగన్ చేయలేదు : సజ్జల

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాాజాగా సజ్జల ఓ టీవీ ఛానెల్ డిబేట్ లో మాట్లాడారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై  వ్యక్తి గతంగా ఎలాంటి కక్ష లేదని.. పర్సనల్ గా ఆయనను చూస్తేనే జాలేస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంత కరిష్మా ఉన్న వ్యక్తి పదేళ్లుగా ఇలాంటి రాజకీయం చేస్తారా అని ప్రశ్నించారు.

రాజకీయాలపై పవన్ కల్యాణ్ కి ఒక క్లారిటీ లేదని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బడ్జెట్ సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించి.. వాటిని అలాగే వదిలేశారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ చేసిన తప్పు.. ఏపీలో సీఎం జగన్ చేయలేదన్నారు. సంక్షేమానికి బడ్జెట్ కేటాయించి.. దాన్ని అలాగే వదిలేయలేదని.. పథకాలు క్షేత్రస్థాయి వరకు పక్కాగా అమలు అయ్యేలా ప్లాన్ చేశామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపించవని అభిప్రాయపడ్డారు సజ్జల.

Read more RELATED
Recommended to you

Latest news