నిన్న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం వైయస్.జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు ముఖ్యమంత్రి జగన్. కృష్ణాజలాల అంశంపై అభ్యంతరం వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి. తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపేయాలని కోరిన సీఎం జగన్… KWDT-II యొక్క నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో 5 SLPలు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్.
గతంలో ఇదే అంశంపై రెండు సార్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లానని వివరించిన సీఎం. 17.08.2021న, తర్వాత 25-06-2022న తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. KWDT-IIకి విధివిధానాలు (ToR) జారీకి 4.10.2023న కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఏపీ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తంచేసిన సీఎం జగన్…. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చుచేసిన రూ.1,355 కోట్లను రీయింబర్స్ చేయాలని కూడా విజ్ఞప్తిచేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.