జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం తెచ్చుకొగలిగా – సీఎం జగన్

-

జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం తెచ్చుకొగలిగామని సీఎం జగన్‌ అన్నారు. విజయవాడ సభలో నాలుగు కీలక కార్యక్రమాలు ప్రకటించింది వైసీపీ.. జగనన్న ఆరోగ్య సురక్షా, వై ఏపీ నీడ్స్ జగన్, బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాలు ప్రకటించింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… మ్యానిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చామని.. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం తెచ్చుకొగలిగామని పేర్కొన్నారు.

AP assembly elections in March and April said CM Jagan
AP assembly elections in March and April said CM Jagan

సామాజిక వర్గాలను గుండెల నిండా ప్రేమించాను…2 లక్షల 35 వేల కోట్ల రూపాయలను డీబీటీ ద్వారా అందించామన్నారు. 2019లో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని.. ఈ నాలుగేళ్ళల్లో నే అదనంగా 2 లక్షల 27 వేల ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. 52 నెలల్లో వ్యవస్థల్లో, పాలనలో తీసుకుని వచ్చిన పార్టీ దేశ చరిత్రలోనే లేదన్నారు. విద్య వైద్య రంగాల్లో వ్యవసాయ విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news