కొత్త జిల్లాలతో సరికొత్త శకానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాల్టి నుంచి కొత్త జిల్లాలో పాలన వ్యవహారాలు జరగనున్నాయి. కాసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాలను ప్రారంభించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు అందుబాటులోకి వచ్చాయి.
అధిక జనాభా, మండలాలు కలిగిన జిల్లాల్లో నెల్లూరు తొలి స్థానంలో.. ప్రకాశం జిల్లా రెండో స్థానంలో నిలిచాయి.
01. శ్రీకాకుళం జిల్లా
తొలుత మూడు రెవెన్యూ డివిజన్ల తో శ్రీకాకుళం జిల్లాను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ.
పలాస, టెక్కలి, శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లా ఏర్పాటు.
02. విజయనగరం జిల్లా గెజిట్ విడుదల.
మూడు రెవెన్యూ డివిజన్లతో విజయనగరం జిల్లా ఏర్పాటు.
విజయనగరం జిల్లాలో బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు.
27 మండలాలతో విజయనగరం జిల్లా ఏర్పాటు.
03. పార్వతీపురం మన్యం జిల్లా గెజిట్ విడుదల.
పార్వతీపురం హెడ్ క్వార్టర్సుగా పార్వతీపురం మన్యం జిల్లా.
రెండు రెవెన్యూ డివిజన్లతో పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు.
పాలకొండ, పార్వతీపురం రెవెన్యూ డివిజన్లతో పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు.
15 మండలాలతో పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు.
పూర్వపు శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, పూర్వపు విజయనగరం జిల్లాలోమి పార్వతీపురం డివిజన్లతో పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు.
04. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
పాడేరు హెడ్ క్వార్టర్సుగా అల్లూరి సీతారామరాజు జిల్లా.
రెండు రెవెన్యూ డివిజన్లతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు.
పాడేరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు.
పూర్వపు రంపచోడవరం, యటపాక డివిజన్లల్లోని మండలాలతో రంపచోడవరం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు.
22 మండలాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు.
పూర్వపు విశాఖ జిల్లాలోని పాడేరు, పూర్వపు తూ.గో జిల్లాలోని రంపచోడవరం, యటపాక డివిజన్లతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు.
05. విశాఖపట్టణం జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
రెండు రెవెన్యూ డివిజన్లతో విశాఖపట్టణం జిల్లా ఏర్పాటు.
భీమునిపట్నం, విశాఖపట్నం రెవెన్యూ డివిజన్లతో విశాఖపట్టణం జిల్లా ఏర్పాటు.
11 మండలాలతో విశాఖపట్టణం జిల్లా ఏర్పాటు.
పూర్వపు విశాఖ జిల్లాలోని విశాఖ, భీమిలీ డివిజన్లతో విశాఖపట్టణం జిల్లా ఏర్పాటు.
06. అనకాపల్లి జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
రెండు రెవెన్యూ డివిజన్లతో అనకాపల్లి జిల్లా ఏర్పాటు.
అనకాపల్లి, నర్శీపట్నం రెవెన్యూ డివిజన్లతో అనకాపల్లి జిల్లా ఏర్పాటు.
24 మండలాలతో అనకాపల్లి జిల్లా ఏర్పాటు.
పూర్వపు విశాఖ జిల్లాలోని అనకాపల్లి, విశాఖ, నర్శిపట్నం డివిజన్లల్లోని మండలాలతో అనకాపల్లి జిల్లా ఏర్పాటు.
07. కాకినాడ జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
రెండు రెవెన్యూ డివిజన్లతో కాకినాడ జిల్లా ఏర్పాటు.
పెద్దాపురం, కాకినాడ రెవెన్యూ డివిజన్లతో కాకినాడ జిల్లా ఏర్పాటు.
21 మండలాలతో కాకినాడ జిల్లా ఏర్పాటు.
పూర్వపు తూ.గో జిల్లాలోని పెద్దాపురం, కాకినాడ, రామచంద్రపురం డివిజన్లల్లోని మండలాలతో కాకినాడ జిల్లా ఏర్పాటు.
08. కొనసీమ జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
రెండు రెవెన్యూ డివిజన్లతో కోనసీమ జిల్లా ఏర్పాటు.
రామచంద్రపురం, అమలాపురం రెవెన్యూ డివిజన్లతో కోనసీమ జిల్లా ఏర్పాటు.
22 మండలాలతో కోనసీమ జిల్లా ఏర్పాటు.
పూర్వపు తూ.గో జిల్లాలోని రామచంద్రపురం, అమలాపురం డివిజన్లల్లోని మండలాలతో కోనసీమ జిల్లా ఏర్పాటు.
09. తూ.గో జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
రాజమహేంద్రవరం హెడ్ క్వార్టర్సుగా తూ.గో జిల్లా ఏర్పాటు.
రెండు రెవెన్యూ డివిజన్లతో తూ.గో జిల్లా ఏర్పాటు.
రాజమహేంద్రవరం, కోవ్వూరు రెవెన్యూ డివిజన్లతో తూ.గో జిల్లా ఏర్పాటు.
19 మండలాలతో తూ.గో. జిల్లా ఏర్పాటు.
పూర్వపు తూ.గో జిల్లాలోని రాజమహేంద్రవరం, రామచంద్రపురం, పెద్దాపురం, ప.గో జిల్లాలోని కోవూరు, ఏలూరు డివిజన్లల్లోని మండలాలతో తూ.గో జిల్లా ఏర్పాటు.
10. ప.గో జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
భీమవరం హెడ్ క్వార్టర్సుగా ప.గో జిల్లా ఏర్పాటు.
రెండు రెవెన్యూ డివిజన్లతో ప.గో జిల్లా ఏర్పాటు.
నర్సాపురం, భీమవరం రెవెన్యూ డివిజన్లతో ప.గో జిల్లా ఏర్పాటు.
19 మండలాలతో ప.గో. జిల్లా ఏర్పాటు.
పూర్వపు ప.గో జిల్లాలోని నర్సాపురం, కోవ్వూరు, ఏలూరు డివిజన్లల్లోని మండలాలతో ప.గో జిల్లా ఏర్పాటు.
11. ఏలూరు జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
ఏలూరు హెడ్ క్వార్టర్సుగా ఏలూరు జిల్లా ఏర్పాటు.
మూడు రెవెన్యూ డివిజన్లతో ఏలూరు జిల్లా ఏర్పాటు.
జంగారెడ్డిగూడెం ఏలూరు, నూజివీడు రెవెన్యూ డివిజన్లతో ఏలూరు జిల్లా ఏర్పాటు.
28 మండలాలతో ఏలూరు జిల్లా ఏర్పాటు.
పూర్వపు ప.గో జిల్లాలోని జంగారెడ్డి గూడెం, ఏలూరు, కుక్కునూరు డివిజన్లు.. పూర్వపు కృష్ణా జిల్లాలోని నూజివీడు డివిజన్లల్లోని మండలాలతో ఏలూరు జిల్లా ఏర్పాటు.
12. కృష్ణా జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
మచిలీపట్నం హెడ్ క్వార్టర్సుగా కృష్ణా జిల్లా ఏర్పాటు.
మూడు రెవెన్యూ డివిజన్లతో కృష్ణా జిల్లా ఏర్పాటు.
మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్లతో కృష్ణా జిల్లా ఏర్పాటు.
25 మండలాలతో కృష్ణా జిల్లా ఏర్పాటు.
పూర్వపు కృష్ణా జిల్లాలోని గుడివాడ, నూజీవిడు, విజయవాడ, మచిలీపట్నం డివిజన్లల్లోని మండలాలతో కృష్ణా జిల్లా ఏర్పాటు.
13. ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
విజయవాడ హెడ్ క్వార్టర్సుగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు.
మూడు రెవెన్యూ డివిజన్లతో ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు.
విజయవాడ, తిరువూరు, నందిగామ రెవెన్యూ డివిజన్లతో ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు.
20 మండలాలతో ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు.
పూర్వపు కృష్ణా జిల్లాలోని నూజీవిడు, విజయవాడ, డివిజన్లల్లోని మండలాలతో ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు.
14. గుంటూరు జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
గుంటూరు హెడ్ క్వార్టర్సుగా గుంటూరు జిల్లా ఏర్పాటు.
2 రెవెన్యూ డివిజన్లతో గుంటూరు జిల్లా ఏర్పాటు.
గుంటూరు, తెనాలి రెవెన్యూ డివిజన్లతో గుంటూరు జిల్లా ఏర్పాటు.
18 మండలాలతో గుంటూరు జిల్లా ఏర్పాటు.
పూర్వపు గుంటూరు జిల్లాలోని గుంటూరు, తెనాలి డివిజన్లల్లోని మండలాలతో గుంటూరు జిల్లా ఏర్పాటు.
15. బాపట్ల జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
బాపట్ల హెడ్ క్వార్టర్సుగా బాపట్ల జిల్లా ఏర్పాటు.
2 రెవెన్యూ డివిజన్లతో బాపట్ల జిల్లా ఏర్పాటు.
బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్లతో బాపట్ల జిల్లా ఏర్పాటు.
25 మండలాలతో బాపట్ల జిల్లా ఏర్పాటు.
పూర్వపు గుంటూరు జిల్లాలోని తెనాలి డివిజన్, పూర్వపు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు డివిజన్ మండలాలతో బాపట్ల జిల్లా ఏర్పాటు.
16. పల్నాడు జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
నరసరావు పేట హెడ్ క్వార్టర్సుగా పల్నాడు జిల్లా ఏర్పాటు.
3 రెవెన్యూ డివిజన్లతో పల్నాడు జిల్లా ఏర్పాటు.
నరసరావు పేట, సత్తెనపల్లి, గురజాల రెవెన్యూ డివిజన్లతో పల్నాడు జిల్లా ఏర్పాటు.
28 మండలాలతో పల్నాడు జిల్లా ఏర్పాటు.
పూర్వపు గుంటూరు జిల్లాలోని నరసరావు పేట, గురజాల, గుంటూరు రెవెన్యూ డివిజన్లల్లోని మండలాలతో పల్నాడు జిల్లా ఏర్పాటు.
17. ప్రకాశం జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
ఒంగోలు హెడ్ క్వార్టర్సుగా ప్రకాశం జిల్లా ఏర్పాటు.
3 రెవెన్యూ డివిజన్లతో ప్రకాశం జిల్లా ఏర్పాటు.
మార్కాపురం, కనిగిరి, ఒంగోలు రెవెన్యూ డివిజన్లతో ప్రకాశం జిల్లా ఏర్పాటు.
38 మండలాలతో ప్రకాశం జిల్లా ఏర్పాటు.
పూర్వపు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, కందుకూరు, ఒంగోలు రెవెన్యూ డివిజన్లల్లోని మండలాలతో ప్రకాశం జిల్లా ఏర్పాటు.
18. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
నెల్లూరు హెడ్ క్వార్టర్సుగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏర్పాటు.
4 రెవెన్యూ డివిజన్లతో నెల్లూరు జిల్లా ఏర్పాటు.
కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు రెవెన్యూ డివిజన్లతో నెల్లూరు జిల్లా ఏర్పాటు.
38 మండలాలతో నెల్లూరు జిల్లా ఏర్పాటు.
పూర్వపు ప్రకాశం జిల్లాలోని కందుకూరు, పూర్వపు నెల్లూరు జిల్లాలోని కావలి, నెల్లూరు, ఆత్మకూరు, గూడూరు రెవెన్యూ డివిజన్లల్లోని మండలాలతో నెల్లూరు జిల్లా ఏర్పాటు.
19. కర్నూలు జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
కర్నూలు హెడ్ క్వార్టర్సుగా కర్నూలు జిల్లా ఏర్పాటు.
3 రెవెన్యూ డివిజన్లతో కర్నూలు జిల్లా ఏర్పాటు.
కర్నూలు, ఆదోని, పత్తికొండ రెవెన్యూ డివిజన్లతో కర్నూలు జిల్లా ఏర్పాటు.
26 మండలాలతో కర్నూలు జిల్లా ఏర్పాటు.
పూర్వపు కర్నూలు జిల్లాలోని కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్లల్లోని మండలాలతో కర్నూలు జిల్లా ఏర్పాటు.
20. నంద్యాల జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
నంద్యాల హెడ్ క్వార్టర్సుగా నంద్యాల జిల్లా ఏర్పాటు.
3 రెవెన్యూ డివిజన్లతో నంద్యాల జిల్లా ఏర్పాటు.
ఆత్మకూరు, నంద్యాల, డోన్ రెవెన్యూ డివిజన్లతో నంద్యాల జిల్లా ఏర్పాటు.
29 మండలాలతో నంద్యాల జిల్లా ఏర్పాటు.
పూర్వపు కర్నూలు జిల్లాలోని కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్లల్లోని మండలాలతో నంద్యాల జిల్లా ఏర్పాటు.
21. అనంతపురం జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
అనంతపురం హెడ్ క్వార్టర్సుగా అనంతపురం జిల్లా ఏర్పాటు.
3 రెవెన్యూ డివిజన్లతో అనంతపురం జిల్లా ఏర్పాటు.
గుంతకల్, అనంతపురం, కళ్యాణ దుర్గం రెవెన్యూ డివిజన్లతో అనంతపురం జిల్లా ఏర్పాటు.
31 మండలాలతో అనంతపురం జిల్లా ఏర్పాటు.
పూర్వపు అనంత జిల్లాలోని అనంతపురం, ధర్మవరం, కళ్యాణ దుర్గం రెవెన్యూ డివిజన్లల్లోని మండలాలతో అనంతపురం జిల్లా ఏర్పాటు.
22. సత్యసాయి జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
పుట్టపర్తి హెడ్ క్వార్టర్సుగా సత్యసాయి జిల్లా ఏర్పాటు.
4 రెవెన్యూ డివిజన్లతో సత్యసాయి జిల్లా ఏర్పాటు.
ధర్మవరం, కదిరి,పుట్టపర్తి, పెనుకొండ రెవెన్యూ డివిజన్లతో సత్యసాయి జిల్లా ఏర్పాటు.
32 మండలాలతో సత్యసాయి జిల్లా ఏర్పాటు.
పూర్వపు అనంత జిల్లాలోని ధర్మవరం, కదిరి, పెనుకొండ రెవెన్యూ డివిజన్లల్లోని మండలాలతో సత్యసాయి జిల్లా ఏర్పాటు.
23. వైఎస్సార్ జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
కడప హెడ్ క్వార్టర్సుగా వైఎస్సార్ జిల్లా ఏర్పాటు.
3 రెవెన్యూ డివిజన్లతో వైఎస్సార్ జిల్లా ఏర్పాటు.
కడప, జమ్మలమడుగు, బద్వేలు రెవెన్యూ డివిజన్లతో వైఎస్సార్ జిల్లా ఏర్పాటు.
36 మండలాలతో వైఎస్సార్ జిల్లా ఏర్పాటు.
పూర్వపు వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు, రాజంపేట, కడప రెవెన్యూ డివిజన్లల్లోని మండలాలతో వైఎస్సార్ జిల్లా ఏర్పాటు.
24. అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
రాయచోటి హెడ్ క్వార్టర్సుగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు.
3 రెవెన్యూ డివిజన్లతో అన్నమయ్య జిల్లా ఏర్పాటు.
రాజంపేట, రాయచోటి, మదనపల్లె రెవెన్యూ డివిజన్లతో అన్నమయ్య జిల్లా ఏర్పాటు.
30 మండలాలతో అన్నమయ్య జిల్లా ఏర్పాటు.
పూర్వపు కడప జిల్లాలోని కడప, రాజంపేట, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్లల్లోని మండలాలతో అన్నమయ్య జిల్లా ఏర్పాటు.
25. చిత్తూరు జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
చిత్తూరు హెడ్ క్వార్టర్సుగా చిత్తూరు జిల్లా ఏర్పాటు.
4 రెవెన్యూ డివిజన్లతో చిత్తూరు జిల్లా ఏర్పాటు.
నగరి, చిత్తూరు, పలమనేరు, కుప్పం రెవెన్యూ డివిజన్లతో చిత్తూరు జిల్లా ఏర్పాటు.
31 మండలాలతో చిత్తూరు జిల్లా ఏర్పాటు.
పూర్వపు చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, తిరుపతి, మదనపల్లె రెవెన్యూ డివిజన్లల్లోని మండలాలతో చిత్తూరు జిల్లా ఏర్పాటు.
26. తిరుపతి జిల్లా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల.
తిరుపతి హెడ్ క్వార్టర్సుగా తిరుపతి జిల్లా ఏర్పాటు.
4 రెవెన్యూ డివిజన్లతో తిరుపతి జిల్లా ఏర్పాటు.
గూడూరు, సూళ్లూరు పేట, తిరుపతి, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లతో తిరుపతి జిల్లా ఏర్పాటు.
34 మండలాలతో తిరుపతి జిల్లా ఏర్పాటు.
పూర్వపు నెల్లూరు జిల్లాలోని గూడూరు, నాయుడు పేట, చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, తిరుపతి, మదనపల్లె రెవెన్యూ డివిజన్లల్లోని మండలాలతో తిరుపతి జిల్లా ఏర్పాటు