జగన్ ఇసుకాసురుడు.. 40వేల కోట్ల దోపిడి : చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ 6 అంశాలతో రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు వచ్చారని ఆరోపించారు. ఇసుకాసురుడు @40 వేల కోట్ల దోపిడి అంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇసుక పై 40 లక్షల మంది నిర్మాణ రంగం కార్మికులు ఆధారపడ్డారని తెలిపారు చంద్రబాబు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుకను అందించామని.. ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 48 మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.  

జిల్లాల వారిగా వైసీపీ నేతలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చి దోచుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు. ఎన్జీటీ ఆదేశాలు కూడా ఉల్లంఘించారని నాలుగున్నరేళ్లలో 40 కోట్ల టన్నుల అక్రమ తవ్వకాలతో 40వేల కోట్లు దోచుకున్నారని టీడీపీ అధినేత ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని.. పోలీసులు ఖబడ్దార్, తప్పు చేసే అధికారులను గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు చంద్రబాబు. నాలుగున్నరేళ్లలో ఇసుక ఎంత తవ్వారు ? ప్రభుత్వ ఆదాయం ఎంతో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగున్నరేళ్లలో జీఎస్టీ ఎంత కట్టారు. ఇసుక తవ్వకాలపై సమాధానం చెప్పాలంటూ 10 ప్రశ్నలు వేశారు చంద్రబాబు. 48 గంటల డెడ్ లైన్ విధించారు టీడీపీ చీఫ్. 

Read more RELATED
Recommended to you

Latest news