ఈ పంట వేస్తే లక్షల్లో సంపాదించవచ్చు.. ఖర్చు కూడా తక్కువే..!

-

వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడి ఖర్చులు పోనీ.. ఎంతో కొంత మిగులుతుంది కానీ.. దీని వల్ల లక్షలు సంపాదించడం అంటే కష్టమే. ఈ పంట వేస్తే మీకు లాభాలే పంట. యాలకులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం పొందే పంటలలో ఇదీ ఒకటి. పంట చేతికి రావడానికి కాస్త సమయం తీసుకున్నా మార్కెట్లో వీటికి ఉన్న గిరాకీతో లక్షల్లో సంపాదించవచ్చు.

యాలకుల సాగుకు తెలుగు రాష్ట్రాల నేలలు అనుకూలం అని నిపుణులు అంటున్నారు. రేగడి నేలల్లో యాలకులు సమృద్ధిగా పండుతాయి. నల్లమట్టి, లాటరైట్ నేలల్లోనూ ఇవి పెరగుతాయి. దేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో వీటి సాగు ఎక్కువగా ఉందట. ఈ రాష్ట్రాల్లోని సహజ సిద్ధమైన నేలల్లో రైతులు యాలకులను పండిస్తున్నారు.

యాలకుల సాగుకు తెలుగు రాష్ట్రాల నేలలు అనుకూలం. రేగడి నేలల్లో యాలకులు సమృద్ధిగా పండుతాయి. నల్లమట్టి, లాటరైట్ నేలల్లోనూ ఇవి పెరగగలవు. దేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో వీటి సాగు ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రాల్లోని సహజ సిద్ధమైన నేలల్లో రైతులు యాలకులను పండిస్తున్నారు. యాలకులు సాగు చేసే భూమిలో ఇసుక ఉండకూడదు. ఇది పంటను పెరగనివ్వదు. ఉష్ణోగ్రత విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. 25 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 35 డిగ్రీల మధ్య ఉంటే ఈ పంట సాగుకు అనుకూలం. మంచి సాగునీటి సదుపాయం ఉండాలి.

వర్షాకాలం అనుకూలం..

వర్షాకాలంలో యాలకుల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మరీ ముఖ్యంగా జులైలో మొక్కలు నాటాలి. ఆ సమయంలో వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తాయి కాబట్టి, సాగునీటి అవసరం తక్కువగా ఉంటుంది. అయితే తొలి నాళ్లలో మొక్కలకు ఎండ వేడిమి నుంచి రక్షణ కల్పించాలి. ఎండ తగలకుండా షేడ్ నెట్‌ ఏర్పాటు చేయాలి.

సాధారణంగా యాలకుల కాండం 1 నుంచి 2 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. కాపు కాసేందుకు చాలా సమయం తీసుకుంటుంది. కనీసం 3 నుంచి 4 ఏళ్లకు పూత పూస్తుంది. అరటి గెలల రూపంలో యాలకుల గెల పుట్టుకొస్తుంది. పంటను కోసిన అనంతరం కొన్ని రోజుల పాటు ఎండబెట్టాలి. ఆ తర్వాత వాటిని శుభ్రపరిచి, పరిమాణం, రంగు ఆధారంగా వేరు చేయాలి. ఈ ప్రక్రియకు 18 నుంచి 24 గంటలు పడుతుంది. ఇక, గ్రేడింగ్ చేసిన పంటను మార్కెట్లో అమ్మేందుకు తీసుకెళ్లాలి.

ప్రస్తుతం మార్కెట్లో యాలకుల ధర భారీగా పలుకుతోంది. కిలో ఇలాచీలకు రూ.1,100 నుంచి రూ.2,000 వరకు ధర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా యాలకుల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వీటి సాగు ఎక్కువగా ఉంటోంది. శ్రీలంక, వియత్నాం దేశాల్లోనూ ఇలాచీ సాగు చేస్తున్నారు. కాబట్టి, ఈ డిమాండ్‌ని అవకాశంగా మలుచుకుని లాభదాయకమైన వ్యాపారంగా యాలకులు సాగు చేయవచ్చు. పంట నష్ట భయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. యువరైతులు ఒకసారి ఈ దిశగా ఆలోచిస్తే మంచి లాభాలను అర్జించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news