ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మానసిక వైకల్య బాధితులకు పెన్షన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. మానసిక వైకల్య బాధితులకు వైద్యులు జారీచేసిన తాత్కాలిక ధ్రువపత్రాల ఆధారంగా పెన్షన్లు మంజూరు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలకు కొత్తగా అర్హత సాధించిన వారికి ప్రతి ఏటా జూలై , డిసెంబర్ మాసాల్లో లబ్ధి చేకూరుస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ఆదేశాల మేరకు మానసిక వైకల్య బాధితులకు తాత్కాలిక ధ్రువపత్రాలు ఆధారంగా డిసెంబర్లో పెన్షన్లు మంజూరు కానున్నాయి. ఇక టు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అత్యంత పారదర్శకంగా అంగన్వాడి సూపర్వైజర్ పోస్టుల భర్తీని నిర్వహిస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంగన్వాడి సూపర్వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.