కత్రినా సింప్లిసిటీ.. విద్యార్థులతో ‘అరబిక్‌ కుతు’ సాంగ్ కు స్టెప్పులు

-

బాలీవుడ్ బ్యూటీ కత్రిన్ కైఫ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తమిళనాడు మధురైలోని మౌంటెన్‌ వ్యూ స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కత్రినా.. విద్యార్థులతో సరదాగా గడిపింది. కాసేపు వాళ్లతో ముచ్చటించి.. ‘బీస్ట్‌’ సినిమాలోని ‘అరబిక్‌ కుతు’ సాంగ్ కు విద్యార్థులతో కలిసి స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  ‘సింప్లిసిటీ అంటే ఇది’ ‘సో క్యూట్‌’, ‘మంచి మనసున్న నటి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందించాలనే లక్ష్యంతో 2015లో మౌంటెన్‌ వ్యూ స్కూల్‌ని ప్రారంభించారు. ఆ పాఠశాలతో కత్రినా తల్లి సుజానెకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ స్కూల్‌లో కొన్నాళ్లు ఆమె పాఠాలు చెప్పారు. ఆ పాఠశాలలో మరిన్ని తరగతి గదులు ఏర్పాటు చేయడం కోసం సాయం చేయాలంటూ 2020లో కత్రినా తన అభిమానుల్ని కోరిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news