ఇవాళ సీఎం వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు, సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నుంచి బయలు దేరనున్న సీఎం… గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ శ్రీ కన్వెన్షన్‌లో సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 30 వ తేదీన అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పర్యటన ఖరారైంది. 30వ తేదీన ఉదయం 9 గంటలకు సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి బయలుదేరి 9:30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు.అక్కడ నుంచి హెలికాప్టర్లో 11:10 గంటలకు మదనపల్లి బీటీ కళాశాలకు సీఎం జగన్ చేరుకుంటారు.