మే 20 నాటికి భూ హక్కు పత్రాలు ఇస్తాం – జగన్‌ ప్రకటన

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షలు ఎకరాలకు రైతులకు పూర్తి హక్కు కల్పిస్తున్నామని.. ఏపీ సీఎం జగన్‌ అన్నారు. భూ సమస్యలు లేకుండా సర్వే చేస్తున్నామని… మే 20 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. భూ సర్వే చేసి, భూ హక్కు పత్రాలు ఇస్తామని… రైతులకు మేలు చేసేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

కనీస మద్దతు ధర లేని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది… రైతన్నలకు మేలు చేస్తుంటే.. ఓర్వ లేని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహించారు. టిడిపి హయాంలో 300 కరువు మండలాలను ప్రకటించి గాలి కి వదిలేశారు. ఇప్పుడు చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు రైతు బాంధవుల వేషం వేశారని నిప్పులు చెరిగారు. రావణ సైన్యం లో భాగంగా, రామాయణం లో సూర్పణఖ మాదిరి దొంగ ప్రేమ చూపుతున్నారు.. రైతులకు రుణ మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన చంద్రబాబు ను ఎందుకు వీళ్ళు అడగలేదని ఆగ్రహించారు.

వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఈ రోజు రోడ్డు ఎక్కుతున్నారు… పొలిటికల్ యాక్షన్ చేస్తున్నాడు, ప్యాకేజీ స్టార్ ఒక పక్క, ఎల్లో మీడియా మరో పక్క తాన.. తందాన అంటున్నారన్నారు సీఎం జగన్‌. రైతులకు ఒకటే చెబుతున్నా..వీళ్ల డ్రామాలు నమ్మకండి… జగన్ అన్న కు ఓటు వేయకపోయినా, అర్హత ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. పేదలకు ఉచితంగా దోచి పెడుతున్నానని టిడిపి, గజ దొంగల ముఠా ప్రచారం చేస్తున్నాయి… చంద్రబాబు కు ఓటు వేయడం అంటే సంక్షేమ పథకాలు ఎత్తి వేసి.. దోచుకో, పంచుకో, తినుకో అని వ్యవహరిస్తారని మండిపడ్డారు జగన్.

Read more RELATED
Recommended to you

Latest news