ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి ఫలితాలు రానే వచ్చాయి. సీబీఎస్‌ఈ బోర్డు ఇవాళ ఈ ఫలితాలను ప్రకటించింది. మొత్తం 87.33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపింది. 99.91 శాతం ఉత్తీర్ణతతో త్రివేండ్రం అగ్రస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 5.38 శాతం ఉత్తీర్ణత తగ్గింది. 90.68 శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు మెరుగైన ఫలితాలు సాధించారు. అబ్బాయిల కంటే 6.01 శాతం అధికం.
ఈ ఏడాది మార్చిలో జరిగిన 12వ తరగతి పరీక్షలకు 16,96,770 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ రోల్ నంబర్లు, స్కూల్ నంబర్లతో డిజిలాకర్, పరీక్షా సంగమ్ నుంచి కూడా ఈ ఫలితాలను తెలుసుకోవచ్చని పేర్కొంది. ఈ సారి కూడా మెరిట్ కార్డులను ప్రకటించలేదు బోర్డు. విద్యార్థుల మధ్య ఆరోగ్యకర వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో.. మెరిట్ లిస్టులను ప్రకటించడం లేదని బోర్డు స్పష్టం చేసింది.
ఈ ఫలితాల కోసం క్లిక్ చేయండి
https://cbse.digitallocker.gov.in/