అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటా : CM జగన్

-

ఇవాళ మరియు రేపు ఇండియా వ్యాప్తంగా రక్షాబంధన్ పండుగ జరుగుతోంది. అయితే రెండు రోజులపాటు ముహూర్తం బాగుండడంతో… ఇవాళ, రేపు రక్షాబంధన్ పండుగ జరుపుకుంటున్నారు ఆడపడుచులు. ఇక రక్షాబంధన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

అందరికీ ఒక అన్నగా తాను అండగా ఉంటానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్ర‌తి అక్క‌కు, ప్ర‌తి చెల్లెమ్మ‌కు రాఖీ పౌర్ణ‌మి శుభాకాంక్ష‌లు అంటూ పోస్ట్ పెట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాల‌కు స‌దా కృతజ్ఞుడిని అని పేర్కొన్నారు. మీ సంక్షేమ‌మే ల‌క్ష్యంగా.. మీ ర‌క్ష‌ణే ధ్యేయంగా పాల‌న సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక‌ అన్న‌గా, ఒక‌ త‌మ్ముడిగా ఎప్పుడూ అండ‌గా ఉంటాన‌ని మాట ఇస్తున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news